Home > సినిమా > 39 ఏండ్ల యంగ్ హీరోకు తల్లిగా 40 ఏండ్ల త్రిష..!!!

39 ఏండ్ల యంగ్ హీరోకు తల్లిగా 40 ఏండ్ల త్రిష..!!!

39 ఏండ్ల యంగ్ హీరోకు తల్లిగా 40 ఏండ్ల త్రిష..!!!
X

వర్షం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష(Trisha Krishnan ).. సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యి దాదాపు 20 ఏండ్లు. వయసైపోతే హీరోయిన్లకు అవకాశాలు ఉండవు అనే రూమర్‌ను పటాపంచలు చేస్తూ.. ఇప్పటికీ కేరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది ఈ చెన్నై అందం. 40 వ పడిలో అడుగుపెట్టినా... నిన్న మొన్న వచ్చిన కుర్రహీరోయిన్లకు ధీటుగా అందాలు ఆరబోస్తూ అందరికీ ముఖ్యంగా అభిమానులకి షాకిస్తోంది. ఇటివల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పీఎస్(PS)’ ఫ్రాంచైజ్‌లో కుందవైగా నటించిన త్రిష.. ప్రేక్షకులను మరోసారి తన అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో తన కెరీర్‌కు కొత్త బూస్ట్‌ను అందించింది. ప్రస్తుతం త్రిష చేతిలో లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా ఉంది. ఇందులో విజయ్‌(Thalapathy Vija)కు జోడీగా త్రిష కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగడంతో పాటు 2023 అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది.





ఇదిలా ఉంటే .. కొంతకాలంగా తమిళంలోనే బిజీ అయిపోయిన త్రిష.. తల్లి పాత్రతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. అది కూడా యంగ్ హీరో శర్వానంద్‌( Sharwanand)కు తల్లి పాత్రలో కనిపించనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళంలో మోహన్‌లాల్, పృథ్విరాజ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘బ్రో డాడీ’ను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi') తెలుగు రీమేక్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో చిరంజీవితో జతకట్టబోయేది త్రిషనే. ఇంతకు ముందు వీరిద్దరు కలసి ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడంతో పాటు ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. పదేళ్ల తర్వాత చిరు, త్రిష కలిసి జతకట్టడం అనేది ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.





అయితే ఈ సినిమాలో త్రిషకు కొడుకు పాత్రలో హీరో శర్వానంద్ నటించనున్నాడట. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా... త్రిష వయసు 40. శర్వానంద్ వయసు 39. దీనితో 40 ఏళ్ల తల్లికి 39 ఏళ్ల కొడుకు పాత్రలో శర్వానంద్ నటించనున్నారు. దీనితో నెటిజన్స్ అవాక్ అవుతున్నారు. ఇంతకు ముందు ఈ పాత్ర కోసం సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారు కానీ సిద్ధు ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు టాక్. ఇక ఇందులో శర్వానంద్‌కు జోడీగా శ్రీలీల(Sri Leela) జంటగా నటించనుందని సినీ వర్గాల సమాచారం.











Updated : 3 Aug 2023 8:45 AM IST
Tags:    
Next Story
Share it
Top