Trisha : ఆ ముగ్గురు అన్నయ్యలకు థ్యాంక్స్ : త్రిష
X
హీరోయిన్ త్రిషపై పలువురు చీప్ కామెంట్స్కు పాల్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. లియో మూవీ సమయంలో మన్సూర్ ఆలీఖాన్, ఇటీవల అన్నాడీఎంకే లీడర్ ఆమెపై నీచమైన కామెంట్స్ చేశారు. త్రిష డబ్బులు తీసుకుని ఓ రాజకీయ నేతను కలిసిందంటూ ఏవీ రాజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. హీరో విశాల్తో పాటు డైరెక్టర్ చేరన్, సముద్ర ఖని, నాజర్ ఏవీ రాజా కామెంట్స్పై తీవ్రంగా స్పందించారు. అటు అన్నాడీఎంకే సైతం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలో తనకు సపోర్ట్గా నిలిచిన చేరన్, సముద్రఖని, నాజర్ లకు త్రిష ధన్యవాదాలు తెలిపింది. తనకు మద్ధతుగా నిలిచిన ముగ్గు అన్నయ్యలకు థ్యాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఏవీ రాజాపై చట్టపరమైన చర్యలకు త్రిష సిద్ధమయ్యారు. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి కొందరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని, అలాంటి నీచమైన మనుషులను పదే పదే చూడటం తనకు ఎంతో అసహ్యంగా ఉందన్నారు. ఆ లీడర్ చేసిన వ్యాఖ్యలకు అవసరమైన ఆధారాలతో కఠిన చర్యలు తీసుకునే వరకూ వదిలిపెట్టనని అన్నారు. కాగా ఆమె ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.