క్లీంకార కోసం ప్రత్యేకమైన గది
X
పెళ్లైన పదకొండేళ్ళ తర్వాత రామ్ చరణ్, ఉపాసనలు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టారు. బాలసారెను కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అంతేకాదు ఇప్పుడు క్లీంకార కోసం ప్రత్యేకమైన గదిని తయారుచేయించామని వీడియో పోస్ట్ చేశారు ఉపాసన.
ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచీ ఉపాసన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పదినెలలు బిడ్డ జాగ్రత్తగా పెరగడానికి దానికి సంబంధించి మానసికోల్లాసానికి ఉపాసన ప్రయత్నించారు. అలాగే డెలవరీ గదిని కూడా సిద్ధం చేయించుకున్నారుట. పుట్టబోయే బిడ్డ కళ్ళు తెరవగానే ఆహ్లాదకరమైన వాతావరణం చూసేలా ఒక రూమ్ అందులో ప్రత్యేకమైర కర్టెన్లను ఏర్పాటు చేయించుకున్నారు. ఆసుపత్రిలో ఉన్నా ఇంట్లో ఉన్నట్టు అనుభూతి కలిగేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు డిజైనర్లు అని చెబుతున్నారు ఉపాసన. దాంతో పాటూ ఇంట్లో క్లీంకార ఉండే గదిని కూడా డిజైన్ చేయించుకున్నారు ఆమె.
ప్రకృతి ఒడిలో ఉండే అనుభూతిని కలిగించేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. బేబి చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ హీలింగ్ ప్రేరణతో సుందరమైన ప్రదేశాలను తలపించేలా డిజైనర్స్ రూమ్ లను తయారు చేశారు. ఇటువంటి సుందర ప్రదేశాలను, అందులో ఉన్నట్టు అనిపిస్తూ నా బిడ్డకు జన్మనివ్వడం, పెంచడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మీకు ధన్యవాదాలు పవిత్రా రాజారామ్ అంటూ రూమ్ డెకొరేషన్ తో ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉపాసన.