రామ్‌చరణ్ కంటే ఉపాసనే ఆస్తే ఎక్కువ.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
X
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ప్రపంచమంతటా అభిమానులను సంపాదించుకున్నాడు. నాటునాటు పాటకు ఆస్కార్ రావడంతో సినిమా యూనిట్‌కు మరింత గుర్తింపు దక్కింది. అయితే, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒక స్టారే. ఆవిడ అపోలో హాస్పిటల్స్ యజమాని కూతురు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాసన అసలు ఏం చదివింది..? తన ఆస్తి ఎంత? అన్న వివరాలపై చాలామంది ఆరా తీస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసనల ఆస్తి విలువ దాదాపు రూ. 2500 కోట్లు. అందులో ఒక్క ఉపాసన ఆస్తి విలువే రూ.1130 కోట్లు ఉంటుంది. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తుంది. దీని ఎండీ సి. ప్రతాప్ రెడ్డి (ఉపాసన తాత) ఆస్తి విలువ రూ. 21వేల కోట్లు. భారత్ లోని టాప్ 100 బిలియనీర్స్ లో ఆయన ఒకరు. అయితే మొత్తం అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ. 70వేలు కోట్లు ఉంటుంది. ఇది కాకుండా బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా, కుటుంబ ఆరోగ్య బీమాకు సంబంధించిన టీపీఏ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉపాసన వ్యవహరిస్తోంది.