Home > సినిమా > ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !
X

కొత్త వారం వచ్చేసింది. ఇక సంక్రాంతి సందడి కూడా మెుదలైంది. పండుగ సందర్భంగా బడా సినిమాలు థియోటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు థియేటర్‌లలోకి రానున్నాయి. థియేటర్‌లలోనే సంక్రాంతి సందర్భంగా డిజిటల్ ప్లాట్‌ ఫామ్ ఓటీటీలోనూ వెబ్ సీరీస్‌లు. సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే

కిల్లర్ సూప్

మనోజ్ బాజ్‌పేయి, కొంకణా సేన్ శర్మ నటించిన కిల్లర్ సూప్ త్వరలోనే స్ట్రీమ్ కానుంది. తన భర్త ప్రభాకర్ స్థానంలో తన ప్రేమికుడు ఉమేష్‌ని తీసుకురావాలనే స్వాతి శెట్టి కిల్లర్ ప్లాన్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ క్రైమ్ డ్రామా చిత్రం జనవరి 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవనుంది.

మిషన్ ఇంపాజిబుల్: హాలీవుడ్‌ చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ (Mission Impossible 7) ఓటీటీ వేదికకు విడుదలకు సిద్ధమైంది. ఇది జనవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 3

'ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 3' సిరీస్ హనుమంతుని శక్తి ఏ పాటిదో చూపించే కథనంతో రూపొందించింది. సీతను రక్షించడంలో రాముడికి ఎలా సహాయం చేసాడు. రెండు సిరీస్‌ల తర్వాత, మూడవ సీజన్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. యానిమేటెడ్ సిరీస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 3 జనవరి 12న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

ఎకో

వెబ్ సిరీస్ ఎకో మాయ చుట్టూ తిరుగుతుంది, తన స్వగ్రామానికి తిరిగి వచ్చి తన మూలాలతో తిరిగి కనెక్ట్ అయే అమ్మాయి కథ ఇది . జనవరి 10న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవనుంది.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'

నితిన్, రోహిణి,. శ్రీలీల నటించిన

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సిరీస్, జనవరి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది వక్కంతం వంశీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ను తెరకెక్కించాడు. ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులైనా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Updated : 8 Jan 2024 10:04 PM IST
Tags:    
Next Story
Share it
Top