Home > సినిమా > UI Movie Teaser:‘ఈ టీజర్‌ మీ ఊహ కోసమే’.. ఎందుకంటే? ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు

UI Movie Teaser:‘ఈ టీజర్‌ మీ ఊహ కోసమే’.. ఎందుకంటే? ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు

UI Movie Teaser:‘ఈ టీజర్‌ మీ ఊహ కోసమే’.. ఎందుకంటే? ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు
X

వింత పాత్రలు, విలక్షణ నటనతో ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న విలక్షణ నటుడు ఉపేంద్ర. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ.. అప్పుడప్పడు వార్తల్లో నిలుస్తుంటాడు. కన్నడ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉపేంద్ర.. తన స్వీయ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న సినిమా ‘యూఐ: ది మూవీ’. ఉపేంద్ర దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత యూఐ సినిమా కోసం మెగా ఫోన్ పట్టాడు. వినాయక చతుర్థి సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశాడు ఉపేంద్ర. ‘చీకటి.. అంతా చీకటి..’ అంటూ మొదలైన టీజర్ లో కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుంది. ‘ఇది ఏఐ వరల్డ్ కాదు. యూఐ వరల్డ్.. దీన్నుంచి తప్పించుకోవాలంటే మీ తెలివితేటలు వాడండి’ అంటూ టీజర్ నడుస్తుంది. చివర్లో ‘ఈ టీజర్‌ మీ ఊహ కోసమే’ అంటూ స్క్రీన్ పై ఓ లోగో వచ్చి ముగుస్తుంది. ఈ టీజర్ చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎలాంటి విజువల్ లేకుండా వచ్చిన మొదటి టీజర్ అని, ఇలాంటి కొత్త ఆలోచనలు ఉపేంద్రకు మాత్రమే వస్తాయని అంటున్నారు.

Updated : 18 Sept 2023 7:49 PM IST
Tags:    
Next Story
Share it
Top