Home > సినిమా > Urvashi Rautela: "నీ ఫోన్ నా దగ్గరే ఉంది.. కానీ ఓ కండిషన్".. ఊర్వశికి అజ్ఞాత వ్యక్తి మెయిల్

Urvashi Rautela: "నీ ఫోన్ నా దగ్గరే ఉంది.. కానీ ఓ కండిషన్".. ఊర్వశికి అజ్ఞాత వ్యక్తి మెయిల్

Urvashi Rautela: నీ ఫోన్ నా దగ్గరే ఉంది.. కానీ ఓ కండిషన్.. ఊర్వశికి అజ్ఞాత వ్యక్తి మెయిల్
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల క్రికెట్ స్టేడియంలో తన ఫోన్ పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్, అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మధ్య మ్యాచ్ ముగిశాక ఊర్వశి రౌతేలా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది. తన ఐఫోన్ పోయిందని తిరిగి తనకు ఇచ్చేయాలని రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఫోను పోయిందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు తన ఫోన్ ను తిరిగి ఇచ్చేసిన వారికి అదిరిపోయే గిఫ్ట్ ను కూడా ఇస్తానని ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి అమ్మడుకు ఈ మెయిల్ చేశాడు. తన దగ్గర ఆమె ఫోన్ ఉందని.. అది ఇవ్వాలంటే తన కండీషన్‌కు ఒప్పుకోవాలని మెయిల్ పెట్టాడు

‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ-మెయిల్‌లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ విషయాన్ని చెబుతూ ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ వ్యక్తి చేసిన ఈ-మెయిల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా ఆమె అందులో చూపింది. స్క్రీన్‌షాట్‌తో పాటు, ఊర్వశి ఈ మెయిల్‌కి థంబ్స్ అప్ సింబల్ కూడా ఇచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె పోగొట్టుకున్న ఫోను ఆమె వద్దకు వస్తుందో లేదో కానీ ఇటువంటి మెసేజ్ లు మాత్రం ఊర్వశికి ఫుల్లుగా వస్తున్నాయి. మొత్తానికి ఈ ఫోన్ వ్యవహారం ఇప్పటిలో తేలేలా కనిపించడం లేదు. ఇక సినిమాల విషయానికోస్తే.. ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉందని తెలుస్తుంది.. సౌత్ లో వరుస ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ ను పెంచుకోవడంతో రెండు చేతులా సంపాదిస్తుంది..

Updated : 20 Oct 2023 10:19 AM IST
Tags:    
Next Story
Share it
Top