పంత్ను లవ్ చేస్తున్నా అనుకుంటున్నారు.. కానీ, నా గ్రీకు వీరుడు అతడే..
X
క్రికెటర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ తెగ చర్చ జరుగుతుంది. రిషబ్ పంత్ కు ఇష్టం లేకున్న.. ఊర్వశినే వన్ సైడ్ లవ్ చేస్తూ.. ప్రేమించమని వెంట పడుతుందని ప్రచారం కూడా నడుస్తుంది. అయితే దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి స్పందించింది. తన గ్రీకు వీరుడి గురించి చెప్పుకొచ్చింది
‘అందరూ నేను రిషబ్ పంత్ ను వన్ సైడ్ లవ్ చేస్తున్నా అనుకుంటున్నారు. ఆ విషయాన్నే సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేస్తున్నారు. అదంతా నా పర్సనల్. నా మనసులో ఉన్న గ్రీకు వీరుడి గురించి ఇప్పుడే చెప్పను’ అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నెట్టింట్లో వచ్చేవన్నీ నిజం అన్నట్లు.. పంత్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఊశ్వశీ వెళ్లేది. విదేశీ పర్యటనకు వెళ్లినా అక్కడ వాలిపోయేది. పంత్ కు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ ఫొటోను షేర్ చేసి.. కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టింది. దాంతో ఊశ్వశీ లవ్ పై రూమర్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతోన్న ‘బ్రో’ సినిమాలో ఊర్శశీ స్పెషల్ సాంగ్ చేస్తుంది.