Home > సినిమా > Vaishnavi Chaitanya : లక్ అంటే మన తెలుగమ్మాయిదే.. పెద్ద బ్యానర్ల నుండి ఆఫర్స్

Vaishnavi Chaitanya : లక్ అంటే మన తెలుగమ్మాయిదే.. పెద్ద బ్యానర్ల నుండి ఆఫర్స్

Vaishnavi Chaitanya : లక్ అంటే మన తెలుగమ్మాయిదే.. పెద్ద బ్యానర్ల నుండి ఆఫర్స్
X

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు హీరోయిన్ ఫ్రెండ్ క్యారక్టర్లు, లేదంటే హీరో చెల్లెలి వేషాలు లేదంటే చిన్నాచితక పాత్రలు తప్ప.. మెయిన్ హీరోయిన్ ఛాన్సులు రావని నిన్న మొన్నటి వరకూ ఇండస్ట్రీలో పాతుకుపోయిన టాక్ ఇది. దర్శక నిర్మాతలు కూడా.. మన దగ్గర టాలెంట్ ఉన్న వాళ్లని వదిలేసి.. ఇన్నేళ్లూ పక్క ఇండస్ట్రీ నుంచి.. పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకున్నారు. కానీ ఈ మధ్య విడుదలైన హిట్ తెలుగు సినిమాల్లోని హీరోయిన్లను చూసినట్లయితే.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిల టైమ్ మొదలైందా.. అనిపిస్తోంది. ఈ మధ్యే తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో ఛాన్సులొస్తున్నాయి. గ్యాప్ లేకుండా వరస సినిమాలతో ఇండస్ట్రీని కమ్మేసిన శ్రీలీల ఇక్కడమ్మాయే. స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. పుట్టి పెరిగింది బెంగళూరు అయినా శ్రీలీల మూలాలున్నది ఇక్కడే. ఇక శ్రీలీల తర్వాత చెప్పుకోబోయే మరో తెలుగమ్మాయి ఎవరంటే.. ఈ మధ్యే బేబి తో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య





హీరోయిన్ గా ఫస్ట్ సినిమాతోనే తన యాక్టింగ్‌తో అందరినీ అట్రాక్ట్ చేసింది. అచ్చమైన ఈ తెలుగందం నటనతోనూ తిరుగులేదని చాటి చెప్పింది. ఇప్పుడీ హీరోయిన్ వరుస ఛాన్సులు వస్తున్నాయి. యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, ఆశిష్‌ సినిమాల్లో హీరోయిన్ గా మన 'బేబి'ని సెలక్ట్ చేశారు మూవీస్ మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఇటీవలే ఓ చిత్రం మొదలైన విషయం తెలిసిందే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఇందులో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యని సెలక్ట్ చేశారు. ఆశిష్‌ హీరోగా అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో చిత్రం కూడా ఇటీవలే మొదలైంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకీ వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.








Updated : 6 Sept 2023 7:57 AM IST
Tags:    
Next Story
Share it
Top