Naga chaitanya : వాలెంటైన్స్ డే స్పెషల్ రీల్ షేర్ చేసిన నాగ చైతన్య
X
అక్కినేని హీరో నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చైతూకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం తండేల్ షూటింగ్‌కు మేకర్స్ కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్‌లో సాయి పల్లవి బాలీవుడ్ మూవీ షూటింగ్‌కు వెళ్లిపోయింది. జపాన్‌లో ఈ మూవీ షూట్ జరుగుతోంది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా తండేల్ టీమ్ క్యూట్‌గా విషెష్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి నాగచైతన్య, జపాన్ నుంచి సాయిపల్లవి కలిసి ఓ రీల్ చేశారు. ఈ మధ్యనే తండేల్ సినిమా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ మూవీ గ్లింప్స్‌లో చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. బుజ్జిత్లి..వచ్చేస్తున్నా కదే..కాస్త నవ్వే..అనే డైలాగ్‌ను చైతు, సాయిపల్లవి చెబుతూ క్యూట్‌గా రీల్ చేశారు. ఆ రీల్‌తో తండేల్ టీమ్ సోషల్ మీడియాలో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది.
ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి జంట చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి జంట క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చైతు, సాయి పల్లవి ఇద్దరూ లవ్ స్టోరీ అనే మూవీతో మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
Happy Valentine’s ☺️❤️ pic.twitter.com/3yoJm3uU56
— Sai Pallavi (@Sai_Pallavi92) February 14, 2024