Varalaxmi Sarathkumar : సీక్రెట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం..పెళ్లి ఎప్పుడంటే?
X
తెలుగు సినిమాల్లో లేడీ విలన్‌గా కనిపించే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీటలెక్కనున్నారు. తమిళ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మికి నేడు నిశ్చితార్థం జరిగింది. అటు తమిళ్, ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ వరలక్ష్మి ప్రేక్షకులకు దగ్గరైంది. హీరోయిన్‌గా కంటే విలన్‌గా బాగా ఫేమస్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రాక్, వీరసింహారెడ్డి, నాంది వంటి సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకుంది. సౌత్‌లోని అన్ని భాషల్లో వరలక్ష్మి వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆమె 50కి పైగా సినిమాల్లో లేడీ విలన్‌గా కనిపించింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ పెళ్లి గురించి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేది కాదు. తాజాగా ఆమె నిశ్చితార్థం చేసుకుని తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మికి నిశ్చాతర్థం జరిగింది. ఇరు కుటుంబాలు మాత్రమే ఈ నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటను ఆశీర్వదిస్తూ అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాదే వీరి పెళ్లి జరుగుతుందని కుటుంబీకులు తెలిపారు. అయితే త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామన్నారు.