వర్ష బొల్లమ్మ పెళ్లి ఫిక్స్.. ఆ టాలీవుడ్ హీరోతో ఏడడుగులు!
X
మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం సినిమాల్లో నటించి అలరించింది వర్ష బొల్లమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న వర్ష.. ఇప్పుడు ఊరుపేరు భైరవకోన సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటించగా.. వీఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. రిలీజ్ దగ్గరపడటంతో.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర బృదం. ఇదిలా ఉండగా.. గతకొద్ది రోజులుగా వర్ష బొల్లమ్మపై ఓ రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, వర్ష ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సీక్రెట్ గా ప్రేమలో ఉన్న ఈ జంట.. పెళ్లి వార్తతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఊరుపేరు భైరవకోన ప్రమోషన్స్ లో ఉన్న వర్ష.. ఈ వార్తపై క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలో నిజం లేదని, పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. ‘మేము బెస్ట్ ఫ్రెండ్. అయినా ఇద్దరం కలిసి ఏనాడూ బయట తిరగలేదు. డేటింగ్ చేసింది లేదు. ఒకరి గురించి ఒకరు పోస్టులు పెట్టలేదు. రియాక్ట్ అవ్వలేదు. వీటిలో ఏది జరిగినా.. ప్రేమ, పెళ్లి అనే వార్తలు నమ్మొచ్చు. కానీ, మా మధ్య ఇలాంటివి ఏవీ లేవు. అయినా ఇలాంటి వార్తు రాస్తున్నారు. వీటిని చూసి మొదట షాకయ్యా. అతను గుడ్ పర్సన్. గుడ్ ఫ్రెండ్. ఈ పుకార్లను ఎవరూ నమ్మొద్ద’ని వర్ష చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Varsha Bollamma trashes marriage rumours with Bellamkonda Ganesh at #ooruperubhairavakona promotions #VarshaBollamma pic.twitter.com/rEezLleEaW
— Filmy Focus (@FilmyFocus) February 7, 2024