Home > సినిమా > తండ్రి కాబోతున్న వరుణ్ ధావన్

తండ్రి కాబోతున్న వరుణ్ ధావన్

తండ్రి కాబోతున్న వరుణ్ ధావన్
X

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి అంటూ రాసుకోచ్చారు. 2021లో వరుణ్, నటాషా పెళ్లి జరిగింది. ప్రస్తుతం హీరో టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ సరసన నటిస్తున్నాడు. గతేడాది బవాల్‌ అనే సినిమాలో జాన్వీ కపూర్ సరసన నటించి.. భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్ లభించింది.

ప్రస్తుతం వరున్ ధావన్.. కీర్తి సురేష్ సినిమాతో పాటు ‘స్ట్రీ-2’ అనే హారర్ మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ హీరో మూడేళ్ల క్రితం ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో వరుణ్‌ తండ్రి కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 2022లో సినిమా ప్రమోషన్ కోసం హిందీ బిగ్‌బాస్ షోకు వెళ్లిన అతడిని హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆటపట్టించాడు. సల్మాన్‌ బొమ్మను వరుణ్‌ చేతిలో పెట్టిన ఇది నీ పిల్లాడికోసమే.. అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు సమాధానం ఇచ్చాడు. ‘ఈ బొమ్మను ఇంటికి తీసుకెళ్లు త్వరలో నీ ఇంటికి ఓ బాబో.. పాపో వస్తుంది’ అని సల్మాన్ సరదాగా అన్న మాటలను నెటిజన్లు నిజం అనుకున్నారు.

Updated : 18 Feb 2024 4:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top