పెళ్ళి డేట్ ఫిక్స్ కాలేదు కానీ వెడ్డింగ్ డెస్టినేషన్ మాత్రం ఫిక్స్ చేసేసారు
X
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్...వరుణ్ తేజ్- లావణ్యల పెళ్ళి మ్యాటర్. సినిమా వాళ్లు ఎవరైనా పమ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే ఎక్కడలేని ఫోకస్ వచ్చేస్తుంది. ముందు వాళ్ళు కలిసి తిరుగుతున్నారు అంటూ వార్తలు మొదలవుతాయి. అక్కడ నుంచి మ్యాటర్ కన్ఫర్మేషన్, ఎంగేజ్ మెంట్, పెళ్ళి ఇలా రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి వరుసపెట్టి. ప్రస్తుతం అలా వార్తల్లో నిలుస్తున్న జంట వరుణ్ తేజ్-లావణ్య. ఈ మధ్యనే వీళ్ళిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయింది. పెళ్ళి ఎప్పుడో ఇంకా కన్ఫార్మ్ కాలేదు. కానీ వీళ్ళు పెళ్ళి అక్కడ చేసుకుంటారు...ఇక్కడ చేసుకుంటారు అంటూ రోజుకో వార్త మాత్రం వస్తోంది.
వరుణ్, లావణ్యల పెళ్ళి ఇటలీలో జరగనుంది అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. అందరిలాగే వీళ్ళిద్దరూ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కే ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటలీలో కాబట్టి పెళ్ళికి రెండు ఫ్మామిలీలు మాత్రమే వెళతారని అంటున్నారు. ఇరు వైపుల కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు అయిన మిత్రులను మాత్రమే ఇటలీ లో జరగబోతున్న పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్ళి తర్వాత మాత్రం హైదరాబాద్ లో ఇండస్ట్రీ , మీడియా వారి కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఉంటుందని కూడా సమాచారం.
దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అసలు పెళ్ళి ముహూర్తమే ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ పెళ్ళి వెన్యూ మీద మాత్రం తెగ చర్చలు జరుగుతున్నాయి. ఎంగేజ్ మెంట్ తర్వాత వరుణ్, లివణ్యలు ఎక్కడికో వెళ్ళొచ్చారు. అది ఇటలీకే అని, వెడ్డింగ్ వెన్యూ కన్ఫార్మ చేసుకోవడానికే అంటూ ఊహాగానాలు చేసేసుకుంటున్నారు. ఏది ఏమైనా వీటన్నింటికీ చెక్ పడాలంటే మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగాల్సిందే.