Home > సినిమా > TWO HEARTS, ONE LOVE.. రేపే వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్

TWO HEARTS, ONE LOVE.. రేపే వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్

TWO HEARTS, ONE LOVE.. రేపే వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్
X

మెగా వారసుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ప్రేమ, పెళ్లి గురించి ఇటీవల సోషల్ మీడియాలో , పలు వెబ్ సైట్‌లలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలోనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరగనుందని, అందుకు ఏర్పాట్లు కూడా మొదలయయ్యాని టాక్ వచ్చిది. కానీ దానిపై అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్ని నిజమే అని అఫిషీయల్ అనౌన్స్ మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్‌కి డేట్ ఫిక్స్ అయినట్లు ఓ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




"ఎన్నో రోజులుగా ఎదురుచూసిన మధురక్షణం రానే వచ్చేసింది. ఇది అఫిషియల్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్" అంటూ వరుణ్-లావణ్య జూన్ 9న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇచ్చాయి. ఈ ఎంగేజ్ మెంట్ కార్డులో "రెండు హృదయాలు ఒక్క ప్రేమ" అని రాసి వరుణ్ తేజ్, లావణ్య ఫొటోలు ఉన్నాయి. ఈ ఎంగేజ్ మెంట్ కార్డ్ పోస్ట్ చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి ఈ కార్డ్ ఒరిజినలా.. లేదా ఫేకా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ పోస్ట్ మెగా ఫ్యామిలిలో ఏ ఒక్కరు షేర్ చేయలేదు. కానీ నెట్టింట్లో మాత్రం తెగ వైరల్ అవుతోంది.





ఇక వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి విన్నర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని జోరుగా కామెంట్స్ వచ్చాయి. ఈ మధ్య పులి మేక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పై లావణ్య చేసిన కామెంట్స్ తో మళ్లీ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ డేటింగ్ వార్తలపై వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎవరూ స్పందించలేదు. ఇక ఆ పుకార్లు నిజం అవుతున్నట్లుగా వారిద్దరు జూన్ 9న ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి.



Updated : 8 Jun 2023 6:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top