Home > సినిమా > మెగా అభిమానులకు చేదువార్త.. ఆ కారణంగా పెళ్లి వాయిదా..?

మెగా అభిమానులకు చేదువార్త.. ఆ కారణంగా పెళ్లి వాయిదా..?

మెగా అభిమానులకు చేదువార్త.. ఆ కారణంగా పెళ్లి వాయిదా..?
X

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఏడేళ్ళుగా ప్రేమించుకుని.. ఆ విషయం బయటికి తెలియకుండా బాగా మేనేజ్ చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. మొన్న జూన్ లో నిశ్చితార్ధం చేసుకున్నారు. అది కూడా గుట్టు చప్పుడు కాకుండా కానిచెద్దాం అనుకున్నా.. మీడియా వల్ల ఎంగేజ్మెంట్ న్యూస్ బయటపడింది. ఇప్పుడు పెళ్లి వార్త కూడా చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి పెళ్ళి ఇటలీ లో జరగనుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తమ ప్రేమ మొదలైన చోటే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్.





ఈనెల 24, 25 తేదీల్లో ఫెయిరీ స్టైల్లో వరుణ్, లావణ్యలు వివాహం చేసుకోనున్నారని టాక్. రాజరిక పద్ధతిలో.. రస్టిక్​ వెన్యూలో పెళ్ళి జరుగనుందని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత దగ్గర సన్నిహితులు మాత్రమే హాజరవుతారని అన్నారు. హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి.. మిగతా వారిని పిలుస్తారని సమాచారం. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి పెళ్లి వేడుక మరోసారి వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. నిహారిక విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే ఇంట్లో వేడుక చేయడం బాగుండదని నాగబాబు భావిస్తున్నాడట. దాంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 3 నెలల తర్వాత మంచి ముహూర్తాలు చూసి పెళ్లి తేదీని ఖరారు చేస్తారని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.




Updated : 13 Aug 2023 6:26 PM IST
Tags:    
Next Story
Share it
Top