గండీవధారి అర్జున అప్డేట్: ఏజెంట్గా వరుణ్ తేజ్
X
ఏజెంట్ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉంటారు. సస్పెన్స్, యాక్షన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ జానర్ లోనే వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా రాబోతోంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా కొత్త అప్ డేట్ ను రిలీజ్ చేశారు. త్వరలో టీజర్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన గ్లింప్స్ ను వరుణ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. మొదట ఈ సినమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా.. అదే డేట్ లో భోళాశంకర్ విడుదల అవుతుండటంతో డేట్ మార్చారు. ఆగస్టు 25 గాంఢీవదారి అర్జున సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమానే కాకుండా సోనీ పిక్చర్స్ బ్యానర్ పై శక్తి పత్రాప్ సింగ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు వరుణ్.
Briefed and ready to take over!#GandeevadhariArjuna pre-teaser coming soon!
— Varun Tej Konidela (@IAmVarunTej) July 4, 2023
Stay tuned.#GDA pic.twitter.com/mN2I2PCquT