Home > సినిమా > బాబాయ్ తరుపున ప్రచారం.. అబ్బాయ్ ఏమన్నాడంటే..?

బాబాయ్ తరుపున ప్రచారం.. అబ్బాయ్ ఏమన్నాడంటే..?

బాబాయ్ తరుపున ప్రచారం.. అబ్బాయ్ ఏమన్నాడంటే..?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న కొత్త మూవీ ఆపరేషన్ వాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా చేస్తోంది. పుల్వామా అటాక్కు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ముందుగా ఈ మూవీని ఫిబ్రవరి 16న రిలీజ్ చేయాలనుకున్న సోలో రిలీజ్లో భాగంగా మార్చి 1న విడుదల కానుంది. మంగళవారం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. భారత్-పాక్ యుద్ధ సన్నివేశాలతో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

మరోవైపు మూవీ యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పెద్ద ఆదేశిస్తే పవన్ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించారు. పవన్ సహా ఆయన సిద్ధాంతాలపై నమ్మకం ఉందని.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పారు. ఇక కంచె తర్వాత దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ జరిగిందని.. అందుకే ఈ మూవీకి ఆపరేషన్ వాలంటైన్ అని పెట్టినట్లు వివరించారు. ఈ మూవీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.


Updated : 21 Feb 2024 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top