Home > సినిమా > గోల్డ్ కలర్లో వరుణ్ లావణ్య వెడ్డింగ్ కార్డ్.. రేటెంతో తెలుసా..?

గోల్డ్ కలర్లో వరుణ్ లావణ్య వెడ్డింగ్ కార్డ్.. రేటెంతో తెలుసా..?

గోల్డ్ కలర్లో వరుణ్ లావణ్య వెడ్డింగ్ కార్డ్.. రేటెంతో తెలుసా..?
X

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. శుక్రవరం వారిద్దరి ఎంగేజ్ మెంట్ జరగనుందని దానికి సంబంధించి ఓ ఇన్విటేషన్ సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనిపై అటు మెగా ఫ్యామిలీ గానీ ఇటు లావణ్య త్రిపాఠి కుటుంబసభ్యులు గానీ స్పందించలేదు. శుక్రవారం సాయంత్రం ఓ హోటల్లో వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ ఈవెంట్ కు హాజరువుతున్నట్లు సమాచారం. ఎంగేజ్ మెంట్ వేడుక అనంతరం వివాహ ముహూర్తం కూడా నిర్ణయించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ తో పాటు మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. వారి వెడ్డింగ్ ఇన్విటేషన్పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగా ఫ్యామిలీ ఒక్కో ఆహ్వాన పత్రిక కోసం ఏకంగా రూ.80,000 ఖర్చు చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. గోల్డ్ కలర్ లో ఉన్న ఈ వెడ్డింగ్ కార్డును వీవీఐపీలకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లికి సైతం ముఖ్యమైన వారినే ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.

వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలాగే వీరికి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. నిహారిక పెళ్లి జరిగిన రాజస్థాన్‌లోని ఉదయఘడ్ ప్యాలెస్‌లోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మరి ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ వరుణ్, లావణ్యల పెళ్లి వార్తలపై స్పందిస్తుందో లేదో చూడాలి.




Updated : 9 Jun 2023 3:51 PM IST
Tags:    
Next Story
Share it
Top