వరుణ్ తేజ్- లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. వేడుక ఎక్కడంటే..?
X
ఆరేళ్ళ ప్రేమ కహానీకి శుభం కార్డు వేస్తూ ఇటీవలే.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిలు ప్రైవేట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. గతకొన్నేళ్లుగా లవ్ జర్నీ చేస్తున్న వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకకు.. కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది సరే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని.. ఈ జంట కనిపించిన ప్రతీ చోట్ల ప్రశ్నలు వస్తున్నాయి.
ఎట్టకేలకు వీళ్ల పెళ్లికి ముహూర్తం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఆగస్టు 24న పెద్దల సమక్షంలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. ఈ వేడుక ఇటలీలో ఘనంగా జరుగుతుందని మెగా కాంపౌండ్ దాటి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విదేశాల్లో చక్కర్లు కొడుతున్న వరుణ్, లావణ్య.. పెళ్లి షాపింగ్ చేస్తున్నారని టాక్.