Varun Tej : రేపే రిలీజ్.. ఆపరేషన్ వాలెంటైన్ రన్ టైం ఎంతంటే..?
X
(Operation Valentine) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీ ఆపరేషన్ వాలంటైన్. శుక్రవారం ఈ మూవీ గ్రాండ్గా విడుదలవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా చేస్తోంది. పుల్వామా అటాక్కు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. భారత్-పాక్ యుద్ధ సన్నివేశాలతో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు మూవీ యూనిట్ ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తమ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు నిర్మాత తెలిపారు. ఇక ఈ సినిమా రన్ టైం 2గంటల 4 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ రన్ టైంతో ఈ మూవీ పెద్ద హిట్ కొడుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. గని, గాండీవధారి అర్జున చిత్రాలతో షాక్లు తిన్నాడు. మధ్యలో ఎఫ్3 ఉన్నా.. అదేమంత ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. అందుకే చాలామంది ఈ మూవీని ఆపరేషన్ వరుణ్ అని కూడా అంటున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కాకపోతే అది అతని కెరీర్కే ఎఫెక్ట్ అవుతుందనే వాదనలున్నాయి.
నిజానికి వరుణ్ తేజ్ చేసినన్ని ప్రయోగాలు అతనితో పాటు వచ్చిన హీరోలెవరూ చేయలేదు. కాకపోతే వైవిధ్యమైన కథలే కాదు.. అందుకు తగ్గ కథనం కూడా ఉంటేనే కమర్షియల్ గా విజయాలు వస్తాయి. లేదంటే కేవలం ప్రశంసలు మాత్రమే దక్కుతాయి. కొన్నిసార్లు అవీ ఉండవు. అందుకే ఈ మూవీతో మెగాప్రిన్స్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అంటున్నారు. పైగా పెళ్లి తర్వాత వస్తోన్న సినిమా కూడా కావడంతో ఆ కోణంలోనూ చూస్తున్నారు. లావణ్య వరుణ్కు లక్ను తెస్తుందా అని ఆలోచించే బ్యాచ్ కూడా ఉంటుంది కదా..? పెళ్లిళ్లు సినిమాలను హిట్ చేయలేవు అని తెలిసినా అనవసరమైన సెంటిమెంట్స్ను వాడేస్తుంటారు. ఏదేమైనా వరుణ్ తేజ్ కు ఈ మూవీ ప్రస్తుతం చాలా కీలకం అనే చెప్పాలి