గాండీవధారి అర్జున’ రిలీజ్కు రెడీ.. థియేటర్లలో ఎప్పుడంటే..?
Mic Tv Desk | 7 Jun 2023 7:52 PM IST
X
X
వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్ తన కెరీర్ లో చేస్తున్న మొదటి యాక్షన్ సినిమా ఇది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
దాని ప్రకారం ఈ సినిమాను ప్రంపచ వ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా కొంతసేపటి క్రితం విడుదల చేశారు. ఏజెంట్ సినిమాతో మెప్పించిన సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్. సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఇక యాక్షన్ సినిమాలంటే ప్రవీన్ సత్తరుకు మంచి మార్క్ చూపిస్తాడు. ఇంత హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కు హిట్ ఇస్తుందా చూడాలి.
Updated : 7 Jun 2023 8:45 PM IST
Tags: tollywood news latest news movie news cinema news telugu news varun sandesh upcoming movie gandivdhari arjuna
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire