Varun Tej : వరుణ్ తేజ్ మరో డిజాస్టర్
X
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు అతని నెక్ట్స్ సినిమాపై ఆపరేషన్ మొదలైంది. యస్.. ఆపరేషన్ వాలెంటైన్ పై వరుణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. బట్ సినిమా డిజాస్టర్ అయింది. మినిమం వసూళ్లు కూడా సాధించలేక బాక్సాఫీస్ వద్ద ఆ మిషన్ దారుణంగా ఫెయిల్ అయింది. ఈ ఫ్లాప్ తో హ్యాట్రిక్ కొట్టాడు వరుణ్. మరి వరుసగా సినిమాలు పోతుంటే కొత్త సినిమాల బడ్జెట్ లెక్కలు మారతాయి కదా..? అందుకే వరుణ్ తర్వాతి సినిమా మట్కాకు రిపేర్స్ స్టార్ట్ అయ్యాయి. కరుణ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీకి కొన్నాళ్ల క్రితమే బడ్జెట్ పెరిగిందని ఆపేశారు. తర్వాత మరో నిర్మాత వచ్చాడు. మళ్లీ స్టార్ట్ చేశారు. బట్.. ఈ ఆపరేషన్ వాలెంటైన్ కూడా పోయిన తర్వాత వరుణ్ పై అంత బడ్జెట్ వర్కవుట్ కాదు అన్న విషయం తేలిపోయింది కదా..? అందుకే మట్కా విషయంలో మరోసారి ఆలోచన చేస్తున్నారట. అసలే ఈ మూవీ 1960స్ లో సాగే పీరియాడిక్ డ్రామా. ఖచ్చితంగా పెద్ద బడ్జెట్ అవసరం. బట్ ఆ బడ్జెట్ ను రికవర్ చేసేంత సీన్ వరుణ్ కు లేదని ఓపెనింగ్స్ చెబుతున్నాయి. అందుకే మట్కా ఆగిపోయే అవకాశాలే చాలా ఉన్నాయంటున్నారు. మొత్తంగా ఆపరేషన్ ఫెయిల్.. మట్కా అవుట్ అనుకోవచ్చా..?