Home > సినిమా > Venkaiah Naidu : బూతులు మాట్లాడే వారికి బూత్లో సమాధానం చెప్పాలి : వెంకయ్య

Venkaiah Naidu : బూతులు మాట్లాడే వారికి బూత్లో సమాధానం చెప్పాలి : వెంకయ్య

Venkaiah Naidu  : బూతులు మాట్లాడే వారికి బూత్లో సమాధానం చెప్పాలి : వెంకయ్య
X

పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. చిరంజీవి, వెంకయ్య నాయుడు సహా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యలను సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య జీవితంలో కృషి, పట్టుదల ఉంటే ఏదైన సాధించవచ్చని చెప్పారు. మోదీపై ఉన్న గౌరవంతోనే పద్మవిభూషణ్ పురస్కారం తీసుకున్నట్లు తెలిపారు. జీవితంలో అవార్డులు, సన్మానాలను పెద్దగా తీసుకోలేదని చెప్పారు.

ప్రజా జీవనంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడే వారికి బూత్లో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో విలువలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నీతి , నిజాయితీ లేని తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీలో గలాటలు చూస్తుంటే బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ భాషను మార్చుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు భారతీయ సంప్రదాయాలను పాటించాలని సూచించారు.

రాజకీయాలు దిగజారుతున్నాయి : చిరు

అంతకుముందు మాట్లాడిన చిరంజీవి.. కాలేజీ రోజుల్లో నుంచి వెంకయ్యనాయుడికి పెద్ద అభిమానిని అని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య స్పీచ్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకొనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హుందాతనం లేదని.. మాటలను తట్టుకోలేక రాజకీయాల్లో ఉండలేకపోయానని చెప్పారు. విమర్శలు చేసే వారిని ప్రజలే తిప్పి కొట్టాలని చిరంజీవి సూచించారు.



Updated : 4 Feb 2024 8:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top