Home > సినిమా > Multi-Starrer: అల్లుడితో మరో మల్టీస్టారర్

Multi-Starrer: అల్లుడితో మరో మల్టీస్టారర్

Multi-Starrer: అల్లుడితో మరో మల్టీస్టారర్
X

తెలుగులో స్టార్ హీరోల మల్టీస్టారర్లు చాలా వరకూ లేవు. కొన్నాళ్ల క్రితం వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ కావడంతో ఆ ట్రెండ్ మళ్లీ మొదలవుతుందనుకున్నారు. బట్ కాలేదు. రీసెంట్ గా చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్యలో నటించాడు రవితేజ. అంతకు ముందు వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీమామ అనే సినిమా చేశాడు. బట్ ఎలా చూసినా బాలీవుడ్ లో లాగా మనోళ్లు మల్టీస్టారర్స్ అంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇతరుల విషయం ఎలా ఉన్నా.. వెంకీ మామ తర్వాత మరోసారి వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాబీ డైరెక్షన్ లో వచ్చిన వెంకీమామ విడుదలకు ముందు మంచి అంచనాలు తెచ్చుకుంది. కానీ తర్వాత వాటిని పూర్తిగా అందుకుంది అని చెప్పలేం. హిట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. అయినా తమ కాంబోలో మరో సినిమాకు అవకాశం ఉన్న కథ పడితే ఆగుతారా.. అందుకే మళ్లీ కలిసి నటించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం వెంకీ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సైంధవ్ సంక్రాంతికి విడుదలవుతుంది. అటు నాగ చైతన్య కూడా శ్రీకాకుళ జాలరు కథతో చందు మొండేటి డైరెక్ట్ చేయబోతోన్న సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు.

ఇక రీసెంట్ గా సురేందర్ రెడ్డి వెంకటేష్ కు ఓ కథ చెప్పాడట. అఖిల్ తో ఏజెంట్ వంటి డిజాస్టర్ ఇచ్చినా సురేందర్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే ఈ సారి సీనియర్ కథా రచయిత భూపతిరాజా తయారు చేసిన కథతోనే వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడట. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ కూ ఆస్కారం ఉన్న ఈ కథలో మరో హీరో కూడా ఉంటాడట. ఇందుకోసం బయటి హీరో ఎందుకు అల్లుడితోనే చేస్తే అయిపోతుంది కదా అని వెంకీ భావించాడట. ఆ మేరకు త్వరలోనే చైతూకు కూడా కథ చెప్పబోతున్నారని టాక్.

చైతూ కూడా ఓకే అంటే ఈ మూవీ 2024 ఫిబ్రవరి లేదా మార్చిలో పట్టాలెక్కుతుందట. చైతూ నో అంటే మరో హీరోను చూసుకుంటారా లేక ఎవరైనా అప్ కమింగ్ కుర్రాళ్లతో కానిచ్చేస్తారా అనేది చూడాలి.

Updated : 11 Oct 2023 4:24 PM IST
Tags:    
Next Story
Share it
Top