Home > సినిమా > Venkatesh Maha: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఇక ఊరుకోను: డైరెక్టర్ వార్నింగ్

Venkatesh Maha: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఇక ఊరుకోను: డైరెక్టర్ వార్నింగ్

Venkatesh Maha: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఇక ఊరుకోను: డైరెక్టర్ వార్నింగ్
X

సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలకు దిగుతున్న వ్యక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు, నటుడు వెంకటేష్ మహా. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా... ఆ సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన తీసిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కూడా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. ఆ తర్వాత నటుడిగా రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్', నాని 'అంటే సుందరానికీ' సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు. తాజాగా హీరో నాని సినిమాపై చేసిన కామెంట్స్ కారణంగా వెంకటేష్ మహా వార్తల్లో నిలిచారు.

నాని హీరోగా ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న' తనకు నచ్చిందని ట్వీట్ చేసిన వెంకటేష్ మహాకు.. . ఓ నెటిజన్ 'రెండు సినిమాలు తీసి 'కెజియఫ్' మీద కామెంట్స్ చేశారు' అంటూ ఆయన్ను చులకన చేస్తూ విమర్శలు చేశారు.

''వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెప్తున్నా వినండి. ఎన్ని సినిమాలు తీశాం అనేది ముఖ్యం కాదు. ఏం సినిమా తీశాం అనేది ముఖ్యం. తెలుగులోని బెస్ట్ సినిమాల్లో కొన్ని నేను తీశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా బెస్ట్ సినిమాలు తీస్తాను. ఊరుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే... ఇంక ఊరుకోను'' అని వెంకటేష్ మహా ట్వీట్ చేశారు

గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన 'కెజియఫ్' మీద వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వాటిని వెటకారంగా గుర్తు చేశారు సదరు నెటిజన్. అప్పుడు వెంకటేష్ మహా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మళ్లీ అదే విషయంపై ట్రోల్ చేయడంతో.. సీరియస్ అయ్యారు. బెదిరింపులను దాటుకుని తాను పైకి ఎదుగుతానని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు, బెదిరింపులపై తాను వ్యక్తిగతంగా పోరాటం చేస్తానని, అవసరం అయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని వెంకటేష్ మహా స్పష్టం చేశారు.

Updated : 12 Dec 2023 10:08 AM IST
Tags:    
Next Story
Share it
Top