Victory Venkatesh: వెంకీ తొందరపడుతున్నాడా
X
విక్టరీ వెంకటేష్ సినిమా అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అప్పుడప్పుడూ మాస్ ను కూడా మెప్పించే ప్రయత్నాలు చేస్తుంటాడు వెంకీ. ప్రస్తుతం కెరీర్ లో మరో మైల్ స్టోన్ కు వచ్చాడు. ఆయన నటించిన సైంధవ్ 75వ సినిమా. ఈ నంబర్ చూస్తే తన తరం హీరోలతో పోలిస్తే కాస్త తక్కువ స్పీడ్ తో వెళ్లినట్టుగానే చెప్పాలి. సైంధవ్ ను మెమరబుల్ గా మార్చుకునే ప్రయత్నాల్లో సరికొత్త కథతో వస్తున్నట్టు చెప్పారు. హిట్, హిట్2 చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తున్నాడు. ఇది అతని ఫస్ట్ తెలుగు మూవీ కావడం విశేషం. ఫీమేల్ లీడ్స్ లో శ్రధ్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు. అయితే ఈ సైంధవ్ కథంతా ఓ చిన్న పాప చుట్టూ తిరుగుతుందని ఆల్రెడీ చెప్పారు. తన కోసమే వెంకీ యుద్ధం చేస్తాడు అనేలా ఉంది.
సైంధవ్ రిలీజ్ విషయంలో వెంకటేష్ తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకున్నారు. 22న అనూహ్యంగా ప్రభాస్ సలార్ రిలీజ్ అంటూ కొత్త పోస్టర్ వేశారు. దీంతో క్రిస్మస్ మూవీస్ అన్నీ ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ క్రమంలో వెంకటేష్ సైంధవ్ ను సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగిల్, ప్రశాంత్ వర్మ హను మాన్ తో పాటు నాగార్జున నా సామిరంగా చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటి సరసకు వెంకీ చేరాడు. సైంధవ్ ను జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. బట్.. వెంకీకి సంక్రాంతి అంతగా కలిసొచ్చినట్టు లేదు. పైగా విపరీతమైన పోటీ ఉంది. ఎంత బలమైన కంటెంట్ ఉన్నా.. ఈ పోటీలో నిలిచి గెలవడం అంటే అంత సులభం కాదు. ఇది నాగార్జునకూ వర్తిస్తుంది. బట్ ఆయన లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు.
మొత్తంగా వెంకటేష్ మూవీ విడుదల విషయంలో తొందరపడుతున్నట్టుగానే కనిపిస్తోంది. మరోవైపు ఇలా జస్ట్ పోస్టర్ వేశారంతే. కానీ ఆ డేట్ కు ఖచ్చితంగా రాదు అని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు పోస్టర్ కూడా వేయడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి నిజంగా వెంకీ సంక్రాంతి బరిలో ఉంటాడా.. లేక ఆ కొందరు చెబుతున్నట్టు చివరి నిమిషంలో తప్పుకుంటాడా అనేది చూడాలి.