Home > సినిమా > Venkatesh Saindhav : ఓటీటీలోకి వెంకీమామ సైంధవ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Venkatesh Saindhav : ఓటీటీలోకి వెంకీమామ సైంధవ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Venkatesh Saindhav  : ఓటీటీలోకి వెంకీమామ సైంధవ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

(Venkatesh Saindhav) కరోనా టైంలో ఓటీటీలకు పెరిగిన క్రేజ్ మాములుగా కాదు. ఏ మూవీ రిలీజ్ అయినప్పటికీ నెల తర్వాత ఓటీటీలోకి రావాల్సిందే. ఓటీటీలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తుండడంతో వాటిని ఎక్కువ రైట్స్ పెట్టి కొనుగోలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా సైంధవ్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. విక్టరీ వెంకటేశ్ ల్యాండ్ మార్క్ 75 మూవీగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం స్ట్రీమింగ్‍ అవుతోంది.

భారీ అంచనాల వెంకీమామ నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి బరిలోకి వచ్చింది. సైంధవ్ తో పాటు మరో మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాచి. అందులో ఏ అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత వెంకీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ‘హిట్’ లాంటి థ్రిల్లర్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేశ్ కొలను డైరెక్షన్ చేయడంతో మూవీకి మరింత క్రేజ్ వచ్చింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ప్రేక్షకుల అంచనాలను వెంకీమామ అందుకోలేకపోయాడు.

మూవీలో వెంకీ యాక్షన్ బాగున్నప్పటికీ కథ, కథనం ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి సైంధవ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్‍ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అవుతోంది.




Updated : 3 Feb 2024 8:37 AM IST
Tags:    
Next Story
Share it
Top