Venu Swamy : వాళ్ళిద్దరూ కలిసుండే అవకాశాలు లేవు.. వేణుస్వామి
X
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలు ఉన్నాయని, వారు భవిష్యత్తులో కలిసి ఉండడమనేది గొప్ప మిరాకిల్ అని, అదొక చిదంబర రహస్యమని ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త వేణు స్వామి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను చెప్పింది 98 శాతం నిజమవుతుందని, అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయని... ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ ముమ్మాటికీ తన మాటలు నిజం అవుతాయని అన్నారు. జాతకాలలో ఉన్న దోషాల వల్లే ఇది జరుగుతుందని, అంతేకానీ తనకెవరూ చుట్టాలు కాదని,శత్రువులు కాదని చెప్పారు.
‘‘వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసుండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉంది. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉంది. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయి. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ ముమ్మాటికీ నా మాటలు నిజం అవుతాయి’’ అని గట్టిగా చెప్పారు. జాతకాలు ఉండే దోషాల ఆధారంగా చెప్పాలంటే పెళ్లిచేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా ఉండడమే మంచిదన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పండితుల మాట వినకుండా పెళ్లిళ్లు చేసుకుంటే.. ఆ తర్వాత టార్ఛర్ భరించక తప్పదన్నారు. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పినప్పుడు కూడా తనను చాలామంది తిట్టుకున్నారని, ఇప్పుడు కూడా అలా తిట్టుకున్నా తానేం చేయలేనన్నారు.