Home > సినిమా > బాలయ్య వారసుడి తెరంగేట్రంపై వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్

బాలయ్య వారసుడి తెరంగేట్రంపై వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్

బాలయ్య వారసుడి తెరంగేట్రంపై వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్
X

సినీ సెలబ్రిటీలకు పర్సనల్ జ్యోతిష్యుడైన వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్లతో పాపులర్ అయిపోయారు. సోషల్ మీడియా పుణ్యమాని ఆయన ఓ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూల్లో ఏదో ఒక కామెంట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆయన తాజాగా మరో బాంబు పేల్చారు. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ కెరీర్ కు సంబంధించి ఆయన చెప్పిన మాటలు నందమూరి ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచాయి.

సమంత, నాగ చైతన్యలు విడిపోతారంటూ జోస్యం చెప్పిన వేణుస్వామి అది కాస్తా నిజం కావడంతో ఆయన మాటలపై గురి పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో, హీరోయిన్ చనిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. హీరో ఆది పినిశెట్టి వైవాహిక బంధంపైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు కూడా సమంత, నాగ చైతన్యలాగే విడిపోతారని చెప్పారు.




బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కేరీర్కు సంబంధించి పై వేణు స్వామి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నందమూరి నట వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అప్పుడు అంటూ ఏళ్లుగా వార్తలు వస్తున్నా అసలు మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడన్నది ఇంకా తేలలేదు. ఆదిత్య 369 సీక్వెల్గా నిర్మించనున్న ఆదిత్య 999 మ్యాక్స్ మూవీతో హీరోగా పరిచయమవుతాడని బాలకృష్ణ సైతం పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు.

తాజాగా వేణు స్వామి ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ నందమూరి ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసే వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అఖండ మూవీ షూటింగ్ సమయంలో తాను లొకేషన్ కు వెళ్లి బాలయ్యను కలిశానని చెప్పారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న మోక్షజ్ఞ జాతకం చూశానని అతని వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్ కూడా అద్భుతంగా ఉందని అన్నారు. అయితే ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీకి మరింత సమయం పడుతుందని, కనీసం రెండు మూడేళ్లైనా వెయిట్ చేయక తప్పదంటూ షాకిచ్చారు. మొత్తమ్మీద మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు వేణుస్వామి మాటలు తీవ్ర నిరాశ మిగిల్చాయి.




Updated : 19 Aug 2023 8:01 PM IST
Tags:    
Next Story
Share it
Top