Venu Swamy' : ప్రభాస్ ఫ్యాన్స్‌కు వేణు స్వామి వార్నింగ్
X
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణుస్వామి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. వేణు స్వామితో ఇటీవలె కొంతమంది సెలబ్రిటీలు పూజలు కూడా చేయించుకోవడంతో ఆయన మాటలను బాగా నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ మధ్యనే ప్రభాస్ సలార్ మూవీ ఫ్లాప్ అవుతుందని ఆయన చెప్పడంతో అప్పటి నుంచి ట్రోల్స్‌కు గురవుతున్నారు. అయినా కూడా ఆయన భయపడకుండా ప్రభాస్ పెళ్లి గురించి, జాతకం గురించి చెబుతూ వస్తున్నారు.
గతంలో వేణు స్వామి మాట్లాడుతూ..ప్రభాస్‌కు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని, ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండడని చెప్పారు. కానీ ప్రభాస్ మాత్రం భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రభాస్‌ను అలా అనడంతో ఆయన ఫ్యాన్స్ ఊరుకోరు కదా. ఇష్టానుసారంగా వేణుస్వామిపై ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఈ సందర్భంగా వేణు స్వామి స్పందించారు. సలార్ సినిమా ఫ్యాన్స్ చూడటం వల్లే ఆడిందని, కృష్ణంరాజుతో తనకు మంచి పరిచయం ఉందని, వాళ్లింట్లో అందరి జాతకాలు తనకు తెలుసని అన్నారు.
ఇప్పుడు కూడా తన మాటను మార్చుకోనని, ప్రభాస్ జాతకం అస్సలు బాలేదని, అవన్నీ తెలుసుకోకుండా ప్రభాస్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. తనని రెచ్చగొడితే ప్రభాస్‌కు సంబంధించిన చీకటి భాగోతాలను బయటపెడతానని అన్నారు. దీంతో ఒక్కసారిగా వేణు స్వామి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి వేణుస్వామి మాటలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.