Home > సినిమా > Vey Daruvey : మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ‘వెయ్ దరువెయ్’ - నిర్మాత దేవరాజ్ పోతూరు

Vey Daruvey : మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ‘వెయ్ దరువెయ్’ - నిర్మాత దేవరాజ్ పోతూరు

Vey Daruvey : మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ‘వెయ్ దరువెయ్’ - నిర్మాత దేవరాజ్ పోతూరు
X

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ఇది. ఈ మూవీ మార్చి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్ పోతూరు సినిమాకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

‘‘మా సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మేం చేసిన రెండో సినిమాయే ‘వెయ్ దరువెయ్’. నవీన్ రెడ్డిగారు చెప్పిన కథ వినగానే అందులో కామెడీ, సెంటిమెంట్ బాగా నచ్చింది. నవీన్ రెడ్డిగారు కథ చెప్పినప్పుడు మూవీలో 80 శాతం కామెడీ ఉంటుంది. దీంతో పాటు తండ్రి, సోదరి భావోద్వేగం కూడా మిక్స్ అయ్యి రన్ అవుతుంటుంది. హీరోగా అనుకున్నప్పుడు సాయిరామ్ శంకర్‌గారినే ఫిక్స్ అయ్యాం. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయిరామ్‌గారు మాతో పాటు ట్రావెల్ అయ్యారు. ఈ సినిమాను 35 రోజుల్లోనే పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అలాగే పూర్తి చేశాం. దీని వల్ల సినిమాను అనుకున్న బడ్జెట్‌లో పదిశాతం అటు ఇటుగానే పూర్తి చేశాం.

‘వెయ్ దరువెయ్’ అనేది మాస్ కామెడీ చిత్రం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. మన సమాజంలో జరిగే అంశాలను తీసుకుని దాన్ని కమర్షియల్ యాంగిల్‌లో తీర్చిదిద్దాం. నిజ ఘటనలే ఆధారంగా తెరకెక్కించాం. కామారెడ్డిలో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి హీరో హైదరాబాద్ వస్తాడు. అక్కడ కథ ఎలా ఉంటుందనేదే సినిమా. ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే కథాంశంతో సినిమా ఉంటుంది.

ఫస్ట్ కాపీ చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా ఔట్ అండ్ ఔట్ మూవీ. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కథకు తగ్గట్టే టైటిల్ పెట్టాం. మాస్ కామెడీ మూవీ. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న భీమ్స్‌గారు మా సినిమాకు సంగీతాన్ని అందించారు. టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. మంచి పాటలు సెట్ అయ్యాయి. అలాగే నటీనటుల విషయానికి వస్తే సీనియర్ ఆర్టిస్టులు నటించారు. అందువల్ల షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం పట్టలేదు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనుకుంటున్నాను.


Updated : 9 March 2024 6:46 PM IST
Tags:    
Next Story
Share it
Top