పోలీసులను ఆశ్రయించిన విద్యాబాలన్ ..ఫేక్ ఇన్‌స్టా అకౌంట్లుతో డబ్బులు వసూలు
X
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేరుతో నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ సైతం ఈ మోసానికి బలైంది. కొందరు దుండుగులు విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు విద్యాబాలన్ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి ఆమె ఫోటోలను, రీల్స్‌ని అందులో ఉంచి సేమ్ ఆమె రియాల్ అకౌంట్ లానే దాన్ని క్రియేట్ చేసి, జాబ్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ విషయం విద్యాబాలన్ దృష్టికి రావడంతో ఆమె కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పారు పోలీసులు. సినీ పరిశ్రమలోని ప్రముఖులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించారు.
తాజాగా విద్యాబాలన్ పేరుతో మోసం జరుగుతోందని ఓ కాస్ట్యూమ్ డిజైనర్‌కు తెలిసింది. ఆ విషయాన్ని నటికి తెలిజేశారు. వెంటనే అప్రమతమైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. భూల్ భూలయ్య 3′ చిత్రానికి సంతకం చేసింది.. 2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భూల్ భూలయ్య’లో ప్రధాన పాత్ర పోషించిన విద్య సీక్వెల్ లో మాత్రం మిస్ అయ్యింది. విద్యాబాలన్.. బాలీవుడ్ లో ఈమెకు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు విద్యా. ఆమెకు దాదాపు 9.2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు ఇన్ స్టాలో. ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులకు ఆమెకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. అందుకే, సెలబ్రిటీల అకౌంట్స్ ని ఫాలో అయ్యేటప్పుడు, పోస్ట్ లు నమ్మేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి ఫేక్ పోస్ట్ లకు రెస్పాండ్ అయ్యి ఇబ్బందుల్లో పడి, డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు తెలిపారు.