సమంత-విజయ్ దేవరకొండ...కెమిస్ట్రీతో చంపేశారుగా....
X
విజయ్ దేవరకొండ-సమంత క్రేజీ కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకుడిగా వస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా గురించి టాలీవుడ్ ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తోంది. సెప్టెంబర్ 1 న విడుదల అవుతున్న ఈ మూవీ మీద హైప్ పెంచేందుకు నిన్న హైదరాబాద్ లో మ్యూజికల్ కన్సెర్ట్ నిర్వహించారు. సీతారామం తర్వాత ఇలాంటి ఓ షో జరిగింది ఖుషీ మూవీకే.
ఖుషి మ్యూజిక్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్...సింగర్స్ తో కలిసి స్టేజిని దడదడలాడించేశారు. సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ప్రదర్శించారు గాయకులు.ఇదంతా ఒక ఎత్తైతే...ఖుషి సినిమా టైటిల్ సాంగ్ కు విజయ్, సమంత చేసిన డాన్స్ మరొక ఎత్తు. మూవీలోనే కాదు...బయట కూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. వాళ్ళిద్దరూ వేసుకున్న డ్రస్సులు, డాన్సులు మొత్తం అన్నీ కళ్ళకు విందు చేశాయి అంటున్నారు చూసినవారు. వీరి రొమాంటిక్ డాన్స్ కు ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. ఆడిటోరియం అంతా హోరెత్తిపోయింది.
మూవీ రిలీజ్ మరికొన్ని రోజుల్లోనే ఉండడంతో విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న సమంత హైదరాబాద్ తిరిగి వచ్చారు. మూవీస్ నుంచి ఒక ఏడాది పాటూ గ్యాప్ తీసుకుంటున్న ఆమె ఖుషి, సిటాడెల్ ఇండియన్ వర్షన్ ప్రమోషన్స్ లో పాల్గొంటానని ముందు నుంచే చెబుతున్నారు. మరోవైపు ఖుషి సినిమా పాటలు, ట్రైలర్ ఇప్పటికే ట్రెండింగ్ గా నిలిచాయి. ఈ సినిమా మీద అంచనాలను ఒక రేంజ్ లో పెంచేశాయి. సినిమా విడుదల కోసం తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ెదురు చూస్తున్నారు.
Rowdy boy @TheDeverakonda & the beautiful @Samanthaprabhu2 surprise everyone with their mesmerising dance performance at #KushiMusicalConcert ❤️✨#Kushi #VijayDeverakonda #Samantha #SamanthaRuthPrabhu #Tollywood #tupaki pic.twitter.com/NFuTq4nDrP
— Tupaki (@tupakinews_) August 16, 2023