Home > సినిమా > Kushi :ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి..తొలిసారి ఏడ్చేసిన విజయ్ ..

Kushi :ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి..తొలిసారి ఏడ్చేసిన విజయ్ ..

Kushi :ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి..తొలిసారి ఏడ్చేసిన విజయ్ ..
X

విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్‎లో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖుషి. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫీల్ గుడ్ లవ్ సీన్స్ , ఫ్యామిలీ ఎమోషన్స్.. డీసెంట్‎గా కనిపించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ ఖుషి సినిమాకి హైలైట్స్‎గా నిలిచాయని రివ్యూస్ చెబుతున్నాయి. ఓ ప్రవచన కర్త , నాస్తికుడి మధ్య జరిగిన సంఘర్షణ..ప్రేమ కథలో కూడా కాన్‎ఫ్లిక్ట్‎ను పెంచడం చాలా బాగుందన్న టాక్ వినిపిస్తుంది. విజయ్, సామ్ కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. దీంతో థియేటర్స్‎లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని సంఘటనలు, వారికి ఎదురైన పరిస్థితుల ఆధారంగా సినిమా కథ సాగడంతో ఖుషి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇవే సినిమాకు ప్లస్ అయ్యాయి.

ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడు సరదాగా ఉండే విజయ్ తన ట్వీటర్‎లో భావోద్వేగమైన మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది." నా సక్సెస్ కోసం మీరంతా నాతో పాటు 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. నేను మంచి సినిమా ఇస్తానని ఓపిగ్గా ఉన్నారు. ఈ రోజు ఖుషితో అది సాధించాం. నా చుట్టూ ఉన్నవారు సంతోషంతో నన్ను నిద్రలేపారు. కొన్ని వందల మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా. మీ కుటుంబంతో వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయండి. మీరంతా ఖుషిని ఆదరిస్తారని నాకు తెలుసు. లవ్ యూ "అని ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీనికి ఎమోషనల్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా విజయ్‌ దేవరకొండ జోడించాడు.

‘ఖుషి’ సినిమా రిలీజ్‎కు ముందు కూడా విజయ్‌ దేవరకొండ ఓ ప్రత్యేక వీడియో పోస్ట్‌ చేశారు. అప్పుడే ఈ చిత్రం విడుదల అవుతుందంటే నమ్మలేకపోతున్నా. మీరంతా నన్ను వెండితెరపై చూసి ఏడాది అవుతోంది. మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూడడం కోసం నేనెంతగా ఎదురుచూస్తున్నానో మాటల్లో చెప్పలేను" అని అన్నారు. ఇక నాస్తికత్వానికి , భక్తికి సంబంధించి మంచి పాయింట్‎ను తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. గుడ్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ లవ్ సీన్స్, ఎమోషనల్‎గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్స్‎గా నిలిచాయని అంటున్నారు . విజయ్ దేవరకొండ సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్‎కి తీసుకువెళ్లారని ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది


Updated : 1 Sept 2023 6:03 PM IST
Tags:    
Next Story
Share it
Top