Home > సినిమా > Family Star Movie : రష్మిక బర్త్ డే నాడే విజయ్ సినిమా రిలీజ్.. మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్..

Family Star Movie : రష్మిక బర్త్ డే నాడే విజయ్ సినిమా రిలీజ్.. మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్..

Family Star Movie : రష్మిక బర్త్ డే నాడే విజయ్ సినిమా రిలీజ్.. మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్..
X

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న.. ఈ ఇద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా గీతా గోవిందం. అప్పటి నుంచి వీరి ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు షురూ అయ్యాయి. అప్పుడ‌ప్పుడు వీరిద్దరూ క‌లిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆ వార్త‌ల‌కు మరింత బలం చేకూర్చారు. ఇదే క్రమంలో ఫిబ్రవరిలో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఇద్దరూ స్టార్లు ఆ వార్తలను ఖండించారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించి మరో ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది.

విజయ్ నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రష్మిక బర్త్ డే కూడా అదే రోజు కావడం గమనార్హం. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. రష్మిక, ఫ్యామిలీ స్టార్ మూవీ పోస్టర్స్తో నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇది కో ఇన్సిడెన్సా..? లేక ప్లాన్ ప్రకారం రిలీజ్ చేస్తున్నారా..?.. ఒకే రోజు బర్త్ డే, సినిమా సెలబ్రేషన్స్ చేసుకుంటారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ జంట వైరల్గా మారింది.

కాగా విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ ఫ్యామిలీ స్టార్ను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా ఘాటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు విడుదల కానుంది. ఏప్రిల్ 5న జూనియర్ ఎన్డీఆర్ దేవర సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అది వాయిదా పడడంతో ఫ్యామిలీ స్టార్కు లైన్ క్లియర్ అయ్యింది. తొలుత 'ఫ్యామిలీ స్టార్' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.

Updated : 3 Feb 2024 9:32 PM IST
Tags:    
Next Story
Share it
Top