Home > సినిమా > Vijay Devarakonda : ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ
X

ఏ హీరోకైనా ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే.. అది సక్సెస్ తో సంబంధం లేకుండా దూసుకుపోతూనే ఉంటుంది. కెరీర్ ఆరంభంలోనే అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. రౌడీ హీరో అనే బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అమ్మాయిల్లో అతనికి ఉన్న క్రేజ్ కి ఇతర స్టార్ హీరోలే ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. అలాగని ఇదేమీ అతను తానుగా క్రియేట్ చేసుకున్నది కాదు. తను నచ్చడం వల్ల ఆడియన్స్ లో వచ్చిన అభిమానమే అది. అందుకే కొన్నాళ్లుగా వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నా అతని క్రేజ్ తగ్గలేదు. అతని సినిమాల ఓపెనింగ్స్ తగ్గలేదు. రీసెంట్ గా వచ్చిన ఖుషీ కమర్షియల్ గా ఫర్వాలేదనిపించుకుంది. ఈ విజయాన్ని మించిన మరో సక్సెస్ అతని ఖాతాలో పడిందిప్పుడు. అయితే ఇది సినిమాగా కాదు. తన అభిమానుల సంఖ్య. యస్.. విజయ్ దేవరకొండకు ఇన్ స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఓ మీడియం రేంజ్ హీరోకు ఇది చాలా పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.

తెలుగు స్టార్స్ లో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేసేవారు తక్కువే. తమ సినిమాల అప్డేట్స్, పండగలు పబ్బాలు తప్ప మిగతా ఏవీ పెద్దగా పంచుకోరు. అందుకే మన స్టార్స్ కు సోషల్ మీడియాలో వారి రేంజ్ కు తగ్గ ఫాలోవర్స్ ఉండరు. బట్ ఉన్నవారిలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అతను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటం ఓ కారణమైతే ఫ్యాన్ ఫాలోయింగ్ మరో రీజన్. దీనివల్ల.. అల్లు అర్జున్ కు ఇన్ స్టాగ్రామ్ లో 23 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఐకన్ స్టార్ తర్వాతి స్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. విశేషం ఏంటంటే.. మన తెలుగు టాప్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు వీరి దరిదాపుల్లో కూడా లేరు. అంటే వీరికంటే విజయ్ దేవరకొండ ఎక్కువ అని కాదు. కానీ స్వయంకృషితో ఎదుగుతూ.. సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా అది అతని గ్రేట్ నెస్ అనే చెప్పాలి.

అయితే కొందరు ఈ ఫాలోవర్స్ వల్ల సినిమాలు హిట్ అవుతాయా అనేవారూ లేకపోలేదు. కాకపోవచ్చు.. కానీ ఏ హీరోకైనా ఓపెనింగ్స్ తెచ్చేది ఫ్యాన్సే కదా.. అంటే విజయ్ సినిమాలకు ఇప్పటికీ భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయంటే కారణం వీళ్లే కదా. సో.. నెక్ట్స్ అతనికి మూవీకి హిట్ టాక్ వస్తే సూపర్ హిట్ చేసేది.. సూపర్ హిట్ టాక్ వస్తే దాన్ని బ్లాక్ బస్టర్ లా చూపించేదీ ఈ ఫాలోవర్స్ కమ్ ఫ్యాన్సే.. ఇది మాత్రం నిజమే కదా..






Updated : 27 Nov 2023 4:47 PM IST
Tags:    
Next Story
Share it
Top