Home > సినిమా > రౌడీ పెండ్లి ... ఎప్పుడు ఎవరితో తెలుసా ?

రౌడీ పెండ్లి ... ఎప్పుడు ఎవరితో తెలుసా ?

రౌడీ పెండ్లి ... ఎప్పుడు ఎవరితో తెలుసా ?
X

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో విజయదేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన క్రేజ్‎ని సంపాదించుకున్నా రౌడీ దానిని కొనసాగిస్తున్నారు. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఇండస్ట్రీ దృష్టిని విజయ్ దేవరకొండ తనవైపు తిప్పుకున్నాడు. విజయ్ డ్రెస్సింగ్ స్టైల్, డిఫ్రెంట్ లుక్స్ కు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. ఇదిలా ఉంటే విజయ్ పెళ్లిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే విజయ్ వివాహం అని, రష్మిక మెడలోనే మూడు ముళ్లు వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్, తన వివాహంపై ఎక్కడా స్పందించలేదు. కానీ మొదటి సారి తన పెళ్లి గురించి విజయ్ దేవర కొండ ఓపెన్ అయ్యాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి అనే చిత్రంలో నటిస్తున్నారు. మజిలి, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న

ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఖుషి ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు.

పెళ్లి అంటే మీ మనసులో ముందు ఏం గుర్తుకు వస్తుంది" అన్న ప్రశ్నకు విజయ్ మాట్లాడుతూ "త్వరలో నేను కూడా వివాహం చేసుకోవాలి. ఆ ఘడియలు దగ్గరలో ఉన్నాయని అనిపిస్తుంది అని చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారా అని అడగగా.."ఇంతకుముందు ఎవరైనా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే ఇరిటేషన్ వచ్చేది. పెళ్లి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నా స్నేహితులకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. వాళ్లను చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వైవాహిక బంధంలో హ్యాపీగా ఉన్నవాళ్లు, ఇబ్బందులు పడుతున్నవాళ్లు ఉన్నారు. ప్రతిదీ ఎంటర్టైనింగ్ ఉంది" అని విజయ్ చెప్పుకొచ్చాడు.

విజయ్ తాజా కామెంట్స్ తో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ చేసుకోబోయే అమ్మాయిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎవరిని విజయ్ వివాహమాడబోతున్నాడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలం నుండి విజయ్ దేవరకొండ మరియు రష్మిక ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. ఎన్నోసార్లు వీరిద్దరూ కెమెరాకు దొరికిపోయినప్పటికీ తమ మధ్య ఏమీ లేదంటూ తోసిపుచ్చారు. ఇక విజయ్ చేసుకోబేయే అమ్మాయి ఎవరో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..


Updated : 9 Aug 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top