Home > సినిమా > వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ డైలాగ్

వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ డైలాగ్

వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ డైలాగ్
X

‘ఐరనే వంచాలా ఏంటీ..’ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డైలాగ్. ఈ హీరో ఆ హీరో అనేం లేదు. చివరికి పొలిటీషియన్స్ వీడియోస్ ను సైతం మార్ఫింగ్ చేసి ఈ డైలాగ్ ను యాడ్ చేస్తున్నారు. మరి ఈ డైలాగ్ ఎక్కడిదీ అంటే.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ లోనిది. దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ మూవీ టీజర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఆ టీజర్ లోనిదే ఈ డైలాగ్. మామూలుగా సినిమా టైటిల్ కు తగ్గట్టుగా సాఫ్ట్ కంటెంట్ తో ఉన్న టీజర్ వస్తుందనుకున్నారు చాలామంది.అందుకు భిన్నంగా మాస్ టీజర్ వదిలారు.

ప్రస్తుతం ఈ టీజర్ లో ఉన్న ఐరనే వంచాలా ఏంటీ అనే మాటతో అనేక రకాల మీమ్స్ మొదలయ్యాయి. జిఫ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బ్రహ్మానందం నుంచి మహేష్ బాబు వరకూ.. ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకూ.. వారి సినిమాల్లోని ఏదో ఒక మాస్ సీన్ లో ఈ డైలాగ్ వాళ్లు చెప్పినట్టుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. నిజానికి ఇప్పుడిది ఓ ఉద్యమంలా మారింది. ఇది కామెడీగా చేస్తున్నారా లేక సెటైరికల్ గా అంటున్నారా అర్థం కావడం లేదు.. ఈ డైలాగ్ ఓ రేంజ్ లో ట్రోల్ అవుతోంది. బట్ మూవీ మేకర్స్ మాత్రం పాజిటివ్ గా తీసుకున్నారు. అందుకే ఈ ట్రోల్స్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము సైతం అంటూ ఐరనే వంచాలా ఏంటీ అంటూ అంటూ హీరో చేతిలో ఐరన్ రాడ్ పట్టుకున్న ఫోటో వదిలారు. ఏదైనా.. ఇలాంటి కంటెంట్ ను పాజిటివ్ గా తీసుకోవడమే కాదు.. తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. చూడూ.. అదీ.. క్రియేటివిటీలో భాగం అంటే..


Updated : 26 Oct 2023 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top