Home > సినిమా > రష్మికతో పెళ్లి.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..?

రష్మికతో పెళ్లి.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..?

రష్మికతో పెళ్లి.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..?
X

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న.. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ గీతాగోవిందం. అప్పటి నుంచి వీరి ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అప్పుడ‌ప్పుడు వీరిద్దరూ క‌లిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆ వార్త‌ల‌కు మరింత బలం చేకూర్చారు. ఇదే క్రమంలో ఫిబ్రవరిలో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే రష్మిక ఈ వార్తలను ఖండించింది. అందులో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. తాజాగా ఈ అంశంపై విజయ్ దేవర కొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని విజయ్ చెప్పారు. ప్రతి రెండేళ్లకోసారి మీడియా తనకు పెళ్లి చేస్తోందని సెటైర్ వేశారు. ‘‘ చాలా సార్లు ఇటువంటి రూమర్స్ను సృష్టిస్తున్నారు. వారంతా నా పెళ్లి కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఫిబ్రవరిలో నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఇందులో నిజం లేదు. ఇటువంటి రూమర్స్ ఇకనైనా ఆపండి’’ అని ఓ ఇంటర్య్వూలో విజయ్ అన్నారు. విజయ్ ప్రస్తుతం పరుశురాం డైరెోన్ లో ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నాడు. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి చిత్రాల్లో నటిస్తోంది.


Updated : 19 Jan 2024 9:39 PM IST
Tags:    
Next Story
Share it
Top