Home > సినిమా > Vijay rashmika..ఒక్కటి కాబోతున్న లవ్ బర్డ్స్..! ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ..

Vijay rashmika..ఒక్కటి కాబోతున్న లవ్ బర్డ్స్..! ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ..

Vijay rashmika..ఒక్కటి కాబోతున్న లవ్ బర్డ్స్..! ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ..
X

టాలీవుడ్‌లో మరో క్రేజీ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట. వీరిద్దరూ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. కొన్నిసార్లు సోషల్ మీడియా పోస్టులతో అభిమానులకు దొరికిపోయారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన ఆ జంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన.

టాలీవుడ్ స్టార్ న‌టులు విజయ్ దేవ‌ర‌కొండ‌, రష్మిక గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకురాగా.. రష్మిక యానిమ‌ల్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఇద్ద‌రూ గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. దీనికి తోడు అప్పుడ‌ప్పుడు వీరిద్దరూ క‌లిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆ వార్త‌ల‌కు మరింత బలం చేకూర్చారు.

తాజాగా ఈ స్టార్స్ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వార్త‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ న్యూస్ చూసిన అభిమానుల్లో కొందరు ఫేక్ న్యూస్ అని అంటుండ‌గా.. క్యూట్ పెయిర్, ఈ వార్తలు నిజమైతే బాగుండని మరికొందరు అంటున్నారు. ఈ వార్తలపై విజయ్ టీం స్పందించింది. విజయ్, రష్మిక పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏ మాత్రం నమ్మొద్దని కోరింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు యానిమల్‌తో మరో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రష్మిక.. పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది.




Updated : 8 Jan 2024 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top