Vijay Devarakonda : ప్రేమకథ ట్రైలర్ను రిలీజ్ చేయనున్న విజయ్ దేవరకొండ
Krishna | 5 Dec 2023 11:26 AM IST
X
X
కిషోర్ డీఎస్, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ప్రేమకథ. ఈ సినిమాకు శివశక్తి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని టాంగా ప్రొడక్షన్స్, సినీ వ్యాలీ మూవీస్పై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ సహా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ను సాయంత్రం 5 గంటలకు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నారు.
కాగా వైవిధ్యమైన లవ్ స్టోరీతో యువతకు నచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తుండగా.. వాసు పెండెం డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు సహా పలువురు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated : 5 Dec 2023 11:26 AM IST
Tags: prema katha prema katha trailer vijay devarakonda vijay devarakonda trailer kishore ds diya seetepalli shivashakti redde radhan tollywood bollywood new movie trailer
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire