విజయ్ దేవరకొండ .. మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా ప్రారంభం
X
గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో మరో సినిమా ప్రారంభమైంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్.. సీతారామం బ్యూటీ.. మృణాల్ ఠాకూర్. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి దిల్‌రాజు నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించి నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. విజయ్, మృణాల్‌ల పై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. విజయ్ – మృణాల్ కాంబోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
పరశురామ్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్‌ను డామినేషన్ నేచర్‌తో డిఫరెంట్‌గా సాగుతుంటాయి. ఇందులో కూడా హీరో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌పై ఆధిపత్యం చెలాయించే అమ్మాయిగా మృణాల్ ఠాకూర్ కనిపించబోతున్నట్లు తెలిసింది. సీతారామం సక్సెస్ తర్వాత నానితో కలిసి ఓ సినిమా చేస్తోంది మృణాల్ ఠాకూర్. డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ ఖుషి, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఖుషి సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తోన్నాడు. గౌతమ్ తిన్ననూరి మూవీలో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో నటిస్తోన్నాడు.
పరుశురాం – విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో వచ్చిన గీతగోవిందం సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుండటంతో దీనిపై కూడా అంచనాలు నెలకొన్నాయి.