విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్
X
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న సినిమా ఫ్యామిలీ స్టార్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఫ్యామిలీ స్టార్ టీజర్ యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. రిలీజ్ అయిన అతి తక్కువ టైమ్ లోనే 5 మిలియన్ వ్యూస్ సంపాదించి దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ ఇమేజ్ కు భిన్నంగా కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో నిండి ఉన్న ఈ టీజర్ చూస్తోంటే సమ్మర్ లో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో విజయ్ కి సిస్టర్స్ గా అభినయతో పాటు తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ కు చెల్లిగా నటించిన వాసుకి కూడా నటిస్తుండటం విశేషం. టీజర్ వచ్చే వరకూ వాసుకి ఈ చిత్రంలో నటిస్తోన్న విషయం చెప్పకపోవడం విశేషమే. పైగా రీసెంట్ గానే తను 90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో మరింత బాగా పాపులర్ అయింది. టీజర్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ కు కూడా మంచి స్కోప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాధ్యతలున్న యువకుడి కథలానూ కనిపిస్తోంది.
ఫ్యామిలీ స్టార్ టీజర్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. బట్ చివర్లో వచ్చిన షాట్ మాత్రం ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేలా ఉంది. తనను ప్రేమించే అమ్మాయి లిఫ్ట్ అడిగినా.. 'లీటర్ పెట్రోల్ పోయిస్తే కాలేజ్ దగ్గర దింపుతా" అని చెప్పడం ద్వారా అతనికి మనీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయో తెలుస్తోంది. మొత్తంగా టీజర్ తో ఈ సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది.
దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండ గీత గోవిందంతో సూపర్ హిట్ అందుకున్నారు. అలాంటి హిట్ కాంబో రిపీట్అవుతున్నప్పుడు అంచనాలూ ఉంటాయి. వాటిని అందుకుంటే సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే అనుకోవాలి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.