Home > సినిమా > ముచ్చటగా మూడు హగ్గులు.. 'ఫ్యామిలీ స్టార్' షూట్ ఫినిష్

ముచ్చటగా మూడు హగ్గులు.. 'ఫ్యామిలీ స్టార్' షూట్ ఫినిష్

ముచ్చటగా మూడు హగ్గులు.. ఫ్యామిలీ స్టార్ షూట్ ఫినిష్
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గతంలో 'గీతగోవిందం' లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ షూటింగ్‌ను మేకర్స్ ఫినిష్ చేశారు. ఈ విషయాన్ని చెబుతూ విదేశాల్లోని షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. షూట్ ఫినిష్ అయ్యింది..ఇక త్వరలోనే థియేటర్లలో కలుద్దాం..అంటూ మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. వీడియోలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ పరశురామ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో స్మైల్ ఇస్తున్నారు.

'ఫ్యామిలీ స్టార్' మూవీ కోసం రౌడీ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అప్పట్లో విజయ్ చేసిన లైగర్ మూవీ అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఖుషీ' కూడా ఏదో పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతోనైనా బిగ్ హిట్ కొట్టాలని విజయ్ చూస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది.


Updated : 16 March 2024 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top