Vijay Deverakonda :కొంచెం క్లాస్.. కొంచెం మాస్.. అదిరిపోయిన విజయ్ సినిమా గ్లింప్స్
X
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘VD13’ టైటిల్ ఖరారయింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. దానికి “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ మొత్తం ఆసక్తికరంగా ఉంది. ఇంటి పనలు చేసే ఫ్యామిలీ మ్యాన్ గా, తప్పుచేసిన రౌడీల బెండు తీసే హీరోగా విజయ్ కనిపించనున్నాడు. ‘లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైంకి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..’ మొదలైన డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది.
‘మగాడంటే.. ఇనుమును వంచాలా..?’ అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్ కొడతాడు. ‘కొబ్బరి కాయ తేవడం మర్చిపోయా అన్నా.. అందుకే తలకాయ పగలగొడుతున్నా’ అనే డైలాగ్ తో ఫైట్ మొదలవుతుంది. దీన్నిబట్టి చూస్తుంటే.. సినిమా మాస్ యాక్షన్ గా ఉండబోతుందని అర్థం అవుతుంది. ఇక గ్లింప్స్ లో మృణాల్ బ్యూటీఫుల్ గా కనిపించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు పూర్తవుతున్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.