అర్ధరాత్రి వీడియో కాల్.. నిజం కాదంటున్న సమంత ఫ్యాన్స్!
X
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. సామ్-విజయ్ భార్యభర్తలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయరాం వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్‌తో పాటు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్గా జరిగిన మ్యూజిక్ ఈవెంట్ సైతం గ్రాండ్ సక్సెస్ అయి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఉన్న క్లోజ్ నెస్ చూసి.. వీళ్ల మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో విజయ్.. సమంతకు ప్రపోజ్ చేస్తాడు.
వీడియోలో.. అర్ధరాత్రి నిద్రపట్టని విజయ దేవరకొండ సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేశాడు. ఇద్దరూ మాట్లాడుతుండగా.. నాక్ నాక్ గేమ్ ఆడదాం అంటాడు విజయ్. అర్ధరాత్రి గేమ్స్ ఏంటి.. సరే లే కానీ అని సమంత అనగా.. ‘నిన్ను మిస్ అవుతున్నా’ అని చెప్పి ఖుషిలోని ‘నా రోజా నువ్వే’ అంటూ పాట పాడి ప్రపోజ్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్ సమంతకు విజయ్ ప్రపోజ్ చేయడమేంటని మండి పడుతున్నారు. అయితే, దీనికి క్లారిటీ ఇచ్చిన మరికొందరు వీడియో కాల్ నిజం కాదని, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రియేట్ చేసిన వీడియో అని చెప్తున్నారు. వీడియో కాల్ లో పాట పాడటంతో మనం అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది రికార్డెడ్ వీడియో.. సమంత గ్లాసెస్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా అంటూ చెప్తున్నారు. ఏదైతేనేం.. మొత్తంగా ఈ వీడియో వైరల్ అవుతోంది.