Home > సినిమా > సినిమా రిలీజ్ కాలేదని నిర్మాతకు గుండెపోటు

సినిమా రిలీజ్ కాలేదని నిర్మాతకు గుండెపోటు

సినిమా రిలీజ్ కాలేదని నిర్మాతకు గుండెపోటు
X

కోట్లు పెట్టి తీసిన భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కు నోచుకోకపోవడం, అప్పుల ఒత్తిడి మీదపడటంతో నిర్మాత విజయ్ జాగర్లమూడి గుండెపోటుకు గురయ్యారు. భారీ బడ్జెట్ తో తీసిన ఆయన ఖుదీరామ్‌ బోస్‌ సినిమా రిలీజ్ కు అడ్డంకులు రావడంతో ఆయనకు ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం విజయ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు ఖుదీరామ్ బోస్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ సినిమాను పలు సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ఈ సినిమా ప్రదర్శించగా అక్కడ కూడా విశేష స్పందన వచ్చింది. కానీ థియేటర్లలో విడుదలకు మాత్రం ప్రతికూలతలు ఏర్పడ్డాయి. దీంతో మానసిక ఒత్తిడితో విజయ్ గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందించారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించాడు.




Updated : 18 Aug 2023 10:14 PM IST
Tags:    
Next Story
Share it
Top