ఓటీటీలోకి లియో.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
X
ఇళయదళపతిగా తమిళనాట తిరుగులేని పాపులారిటీ ఉన్న హీరో విజయ్. అతని సినిమాలు టాక్, రివ్యూస్తో పనిలేకుండా వసూళ్లు సాధిస్తుంటాయి. అందుకే రజినీకాంత్ తర్వాత తనే కోలీవుడ్ సూపర్ స్టార్ గా చెప్పుకుంటారు అక్కడి నిర్మాతలు, ఆడియన్స్. విక్రమ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ మరోసారి విజయ్ తో సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు సహజంగానే అంచనాలు పెరిగాయి. ఈ మూవీకి థియేటర్స్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్లో దూసుకెళ్తోంది.
అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ 300కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ 500 కోట్లను కొల్లగొడుతుంది ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. లియో డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలో నెలరోజుల్లోపే స్ట్రీమింగ్ చేసుకునేలా రిలీజ్కు ముందే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.