Home > సినిమా > LEO VIJAY : డెవిల్తో పోరాటం... ఫ్యాన్స్కు విజయ్ మాస్ ట్రీట్..

LEO VIJAY : డెవిల్తో పోరాటం... ఫ్యాన్స్కు విజయ్ మాస్ ట్రీట్..

LEO VIJAY : డెవిల్తో పోరాటం... ఫ్యాన్స్కు విజయ్ మాస్ ట్రీట్..
X

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ - త్రిష జంటగా నటిస్తున్న మూవీ లియో. మాస్టర్ తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో సనిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. విజయ్ ఫ్యాన్స్ పండగా చేసుకునేలా మాస్ పోస్టర్ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

విజయ్ కోపంతో రగిలిపోతూ.. సంజయ్ దత్ గొంతు పట్టుకొని ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. పోస్టర్ తోనే వీరిద్దరి మధ్య పోరాటం ఎలా ఉండబోతుందో అభిమానులకు చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. ఈ పోస్టర్ను ట్వీట్ చేసిన లోకేష్.. దీనికి కీప్ కామ్ అండ్ ఫేస్ ది డెవిల్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. విజయ్ విశ్వరూపం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లియో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ విలన్గా నటిస్తుండగా..ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, శాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు.




Updated : 21 Sept 2023 8:37 PM IST
Tags:    
Next Story
Share it
Top